త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా పోలీసులకు సైబర్ క్రైమ్, కాల్ డేటా రికార్డు అనాలిసిస్‌పై జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నిపుణులతో ఒకరోజు ప్రత్యేక వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాల్ డేటా రికార్డు విశ్లేషణ ద్వారా నేరాలను ఛేదించడంలో మరింత వేగం, స్పష్టత సాధ్యమవుతుందని వివరించారు. జిల్లాలో సైబర్ క్రైమ్ సంఘటనలను గణనీయంగా తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ముఖ్యంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన ఆవశ్యకత గురించి అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అడిషనల్. ఎస్ పి బి. రాములు నాయక్ గారు,ఎస్.శ్రీనివాసులు (డిఎస్‌పి, డిటిసి వికారాబాద్), శ్రీనివాస్ రెడ్డి (డిఎస్‌పి వికారాబాద్), జానయ్య (డిఎస్‌పి, డిసిఆర్‌బి వికారాబాద్) తో పాటు, సిఐ అధికారులైన ఎన్. శ్రీధర్ రెడ్డి (కోడంగల్), ఎస్.శ్రీనివాస్ రెడ్డి (పరిగి), జి.వెంకట్ (మొమింపేట్), మరియు వై. నాగేశ్ (కరణ్ కోట్) హాజరయ్యారు. వీరితో పాటు 09 మంది ఎస్.ఐ.లు, 02 మంది హెచ్.సి.లు, మరియు 19 మంది పి.సి.లు సహా మొత్తం 34 మంది పోలీసు సిబ్బంది ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ వివరాలను తెలుసుకున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


