Vadderas : వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

TRINETHRAM NEWS

ఇరుగదిండ్ల కృష్ణ. వడ్డేరసంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు.

దేవరకొండ డివిజన్ నవంబర్ 07 త్రినేత్రంన్యూస్ . ఎంతోకాలంగా అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డెర సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వడ్డెర కులస్తులు వారి యొక్క పరిస్థితి దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు అని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వడ్డెర్ల కోరిక గత 25 సంవత్సరాల నుండి వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్నో బహిరంగ సభలో గతంలో పాలించిన అన్ని పార్టీల ముఖ్యమంత్రిలను మంత్రుల బృందాన్ని కోరినప్పటికీ వారి యొక్క డిమాండ్ నెరవేరలేదు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా అన్ని కోణాల నుంచి ఆలోచించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్టీ జాబితాలో చేర్చడానికి 100% మా యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉందని గత రెండు సంవత్సరాలు క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఎన్నో బహిరంగ సభలో అలాగే నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో కూడా మాట ఇచ్చినారు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయిల్ మల్లు ఆధ్వర్యంలో చాలామంది మంత్రివర్గ బృందాన్ని కలవడంజరిగింది.

వారు కూడా సానుకూలంగా హామీ ఇచ్చినారు అయ్యా ముఖ్యమంత్రి మా యొక్క కోరిక మన్నించి మమ్మల్ని మేస్త్రి జాబితాలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. దయగలవారై మా యొక్క కోరికలను నెరవేర్చాలని నల్లగొండ జిల్లా వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadderas should be included in the ST list

You cannot copy content of this page

Scroll to Top