- ప్రైవేట్ లెక్చరర్ ఫోరమ్ ఆధ్వర్యంలో సమావేశం, గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మధుయాష్కీగౌడ్
- కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరిన మధుయాష్కి గౌడ్
Trinethram News : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్స్ లాంటి ఎన్నో సంఘాల కృషి, భాగస్వామ్యం ఉందని.. వారందరూ ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నిలబడి పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ లో ప్రైవేటు లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అన్ని రంగాలు ధ్వంసం అయ్యాయని, ఫీజు రియంబర్స్ బకాయిలు రూ. 3000 కోట్ల పైన బకాయిలు పెట్టారన్నారు. లెక్చరర్స్ కి కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ఇవ్వడం దారుణమని, అది కూడా చాలీచాలని జీతాలు ఇవ్వడం బాధాకరమన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నాయని.. తెలంగాణ వస్తే ఆ సంస్థలు మూతపడతాయి అనుకుంటే.. గత బీఆర్ ఎస్ పాలన్లో మరింత విస్తరించాయన్నారు. తెలంగాణ వాసులు ఏర్పాటు చేసుకున్న చిన్న కళాశాలల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ప్రైవేటు లెక్చరర్ల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుందని.. సమస్యలన్నీ వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అంతకుముందు మధురానగర్ లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా బడుగు వర్గాల చెందిన వ్యక్తికి చట్టసభల్లో ప్రాతినిధ్యం బలపడుతుందని.. అందరు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు కత్తి వెంకటస్వామి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


