Roads Repair : వికారాబాద్ జిల్లాలో రోడ్లు బాగు చేయాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఎల్ఐసి ఆఫీసు ముందు ఉన్న గుంతల రోడ్ పై సిపిఎం నాయకులు నిరసన్ ధర్నా నేడు జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ఆఫీసు ఏరియాలో గుంతల మయమైన రోడ్డుపై నిరసన ధర్నా. ఆర్ మహిపాల్ సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు బాగుచేయాలని జిల్లాలో రోజు రోజుకు యాక్సిడెంట్లు పెరుగుతాయి. అనేక మంది పేదలు కూలీలు రైతులు చనిపోతున్న పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ రోడ్ ప్రమాదలలో చనిపోయినది పేదలు, ఎంపీ ఎమ్మెల్యే లు కాదు. రోడ్ యాక్సిడెంట్లు అరికట్టాలంటే తక్షణమే రోడ్లు బాగు చేయాలని చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఆర్ అండ్ బి, జెడ్పి,పి ఆర్ రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వనికి డిమాండ్ చేస్తున్నాము.

లేనిచో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన్ సత్యనారాయణ నవీన్ నాయకులు అక్బర్ శ్రీనివాస్ లక్ష్మయ్య కృష్ణ రాజేందర్ నర్సింలు అనంతయ్య రాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Roads should be repaired

You cannot copy content of this page

Scroll to Top