వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మన్నెగూడ–హైదరాబాద్ రోడ్ విస్తరణకు డిమాండ్.. మన్నెగూడ–హైదరాబాద్ రోడ్ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తాండూరు పట్టణంలో సకలజనాలతో కలిసి నిరసనలో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులను మంజూరు చేసినప్పటికీ, ఎన్నికల అనంతరం కోర్టులో ఉన్న కేసులపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు.
ప్రజల ప్రాణ భద్రతను పరిగణనలోకి తీసుకొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకొని మళ్లీ ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని పైలెట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


