తేదీ : 02/11/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); పెందుర్తి నియోజకవర్గం, మండల పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖ ప్రతి ఒక్కరి కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నదని,ఎటువంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన పక్షంలో తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని,ఇప్పటికే కొంతమంది వ్యక్తులను గుర్తించి మంచి ప్రవర్తనతో ఉండేందుకు కోర్టు ముందు బైండోవర్ చేయించినట్లు తెలిపారు.
అలాగే, తాము ప్రవర్తన మార్చుకుని సమాజంలో ఒరవడికి అనుగుణంగా జీవిస్తున్న వారిని గుర్తించి, వారి రౌడీ షీట్లు రద్దు చేయించే దిశగా పై అధికారులకు నివేదిక పంపినట్లు పేర్కొన్నారు..సీఐ మరింతగా సూచిస్తూ,గత తప్పిదాలను పక్కనపెట్టి కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మంచిమార్గంలో సాగాలని, చట్టాన్ని గౌరవించి సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా మారాలని,పోలీసులు శత్రువులుగా కాక, ప్రజల భద్రత కోసం పనిచేసే మిత్రులుగా భావించాలని, అని హితవు పలికారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


