అల్లూరిజిల్లా జి.మాడుగులు అక్టోబర్ 31, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, జీ.మాడుగుల మండలం: మొంథా తుఫాన్ ప్రభావిత బీరం పంచాయతీ, అగం పాడు గ్రామంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, పార్టీ మహిళా నాయకురాలు గండేరీ పార్వతమ్మ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
పంటలు నష్టపోయిన రైతులు, ఇళ్లు కూలిపోయిన ప్రజలను పరామర్శించిన ఆమె మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అన్నదాతలతో పాటు ఉంది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. నష్టపోయిన రైతులకు, గృహ నష్టం చెందిన వారికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం” అని భరోసా ఇచ్చారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పక్కన ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులు జీ.అప్పలమ్మ, వరాలమ్మ, రోష్ని, భువనేశ్వరి, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


