Educational institutions’ Strike : వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

TRINETHRAM NEWS

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం గా జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ అన్నారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ బంద్ కు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, జిల్లా లో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దినెక్కారు అన్నారు కదా ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8150 కోట్ల దాకా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివి విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందాము అంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రంలో బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి 1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా దసరా దీపావళి కి విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసింది అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు రాష్ట్రం లో విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉన్న విద్య రంగం పై ఒక్క సారి సమీక్ష లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కాబట్టి రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగా సమస్యలపై అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఎస్ ఎఫ్ ఐ గా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ జిల్లా నాయకులు రాకేష్ , సిద్దు ,రెహాన్, జునేద్ అఖిల్ , శిర్యాజ్, రాజు ,ఇస్మాయిల్ దీపక్ ,చందు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Educational institutions' strike in Vikarabad

You cannot copy content of this page

Scroll to Top