Minister Seethakka Expressed Anger : వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

TRINETHRAM NEWS

Trinethram News : వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని, దోషులను కఠినంగా శిక్షించాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆమె స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క ఈ ఘటనపై వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. బాధిత చిన్నారికి తగిన వైద్య, మానసిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

చిన్నారుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికీ తావు ఉండదు. చిన్నారులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Seethakka expressed anger

You cannot copy content of this page

Scroll to Top