VK Ramavaram Bridge : శిలాఫలకానికే పరిమితమైన వి కె రామవరం బ్రిడ్జి నిర్మాణం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిమండల కేంద్రంలో శిలాఫలకానికే పరిమితమై వి కె రామవరం బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే టెండర్లు పిలిచి ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని వి కె రామవరం,అన్నారం,గ్రామల వద్ద ప్రారంభానికి నోచుకోని బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన శిలా పాలకాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సరంలో మండల పరిధిలో గిరిజన గ్రామాలకు బిడ్జ్ సాకర్యం కల్పించడానికి వి కె రామవరం,అన్నారం వంతెనల నిర్మాణనికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సి.ఆర్.ఆర్ గ్రాంట్ ద్వారా ఒక కోటి 60 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారని శంకుస్థాపన కె పరిమితమైన వి కె రామవరం,అన్నారం వంతెనల నిర్మాణాల పై ప్రభుత్వం గిరిజన గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వర్షాకాలంలో వంతెనెల వద్ద భారీ వర్షం నీరు వరదలై పారుతూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలకు తప్పని తిప్పలు రహదారులు వంతెనలు సక్రమంగా లేక గిరిజన ప్రజలకు ప్రయాణాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వి.కె రామారం,కొత్తూరు,అన్నారం, చింతలపాడు,ధర్మన్న నగర్, గుర్రాల కుంట,ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు వంతెన నిర్మాణం నోచుకోక రవాణా సౌకర్యాం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయా గ్రామాల గిరిజన ప్రజల కష్టాలు తీర్చేది ఎన్నడని వృద్ధులు, విద్యార్థులు నరక యాతన పడుతున్నారు. వికె రామవరం,అన్నరం గ్రామల లోలెవల్ సప్టాల స్థానం లో బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి నిర్మాణాలను వెంటనే ప్రారంభించి తక్షణమే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యాం కల్పించాలని డిమాండ్ చేశారు.‌ ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పోడియం వెంకటేశ్వర్లు, మాలోతు రావూజా,నిమ్మల మధు,సోయం కృష్ణ,కుంజా భాస్కర్,పోడియం రాంమూర్తి,హేమని, వెంకటనర్సు,శ్రీను, ముత్యాలు,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Construction of VK Ramavaram Bridge

You cannot copy content of this page

Scroll to Top