త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గంలో గుంతలు పడి, వర్షపు నీరు నిలిచిపోయి అద్వానం గా, మారిన రోడ్లపై బి.ఆర్.ఎస్ నేతలు ఆదివారం నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు రేగా, కాంతారావు పిలుపుతో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, గోతుల తో సెల్ఫీ, కార్యక్రమం చేపట్టారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, రెండేళ్ల పాలనలో రోడ్ల పై కనీసం మట్టి కూడా పోయలేదని బి.ఆర్.ఎస్ నేతలు మండిపడ్డారు.
గ్రామీణ జాతీయ రహదారుల దుస్థితి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజా పాలనను గాలికి వదిలేసి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తక్షణమే రోడ్లు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


