Collector Orders : జొన్నాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అమలాపురం, అక్టోబర్ .25. జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారుల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జాతీయ రహదారుల అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జాతీయ రహదారుల శాఖ అధికారులు, సృష్టి సంస్థ గుత్తేదారులతో ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి ఏడున్నర సంవత్సరం దాటింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలి,” అని సూచించారు.

కాంట్రాక్టర్ వివరాల్లో తెలిపిన ప్రకారం, ఫ్లైఓవర్ ఫిల్లింగ్‌ కోసం సరైన మట్టి లభించక ఆలస్యం జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎన్‌టీపీసీ నుంచి ఫ్లై యాష్‌ సేకరణకు ఒప్పందం కుదిరిందని, సుమారు లక్ష మెట్రిక్ టన్నులు ఫ్లై యాష్‌ను త్వరలో ఉపయోగించి ఫిల్లింగ్ పనులు ప్రారంభించనున్నట్లు గుత్తేదారులు తెలిపారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు
అన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలి.

స్ట్రక్చర్లు, సర్వీస

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector orders to expedite Jonnada flyover work

You cannot copy content of this page

Scroll to Top