Janahita : జనహిత ఎం ఎల్ ఏ మార్నింగ్ వాక్ విత్ పీపుల్

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 25 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఎర్రగుంట పల్లి గ్రామంలో *”జనహిత – ఎం ఎల్ ఏ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించి,గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను దేవరకొండ నియోజక వర్గ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పరిష్క రించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ సమస్యలు మరియు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించేందుకు తాను కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలతో కలిసి నడవడం వారి సమస్యలను వినడం వాటికి పరిష్కారం చూపడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని . వివిధ వార్డులలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోని తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులు ఆదేశించారు. సి ఆర్ ఆర్ (ఎస్ సి పి) నిధుల నుండి మంజూరు అయిన ₹ 10.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనచేశారు. అనంతరం ఎర్రగుంట పల్లి గ్రామంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janahita MLA Morning Walk with People

You cannot copy content of this page

Scroll to Top