Man Donates Eyes : చెముడులంకలో వృద్ధుడి నేత్రదానం

TRINETHRAM NEWS

భార్య ఆశయాన్ని నెరవేర్చిన కుటుంబ సభ్యులు

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం చెముడు లంక, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రక్తదానం మాదిరిగా నేత్రదానంపై అవగాహన పెరుగుతుంది. మనిషి మరణాంతరం మళ్లీ చూడగలిగే అవకాశం కలుగుతుంది ఈ నేత్ర దానం వల్ల‌.అందుకునే డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన చోడపనీడి వీర్రాజు (81) వృద్ధాప్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే తన భర్త కళ్లు దానం చేయాలని వీర్రాజు, భార్య సరస్వతి పట్టుపట్టడంతో వారి కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలు దానం చేయడానికి నిడదవోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణనన్ నేత్ర వైద్యశాలకు సమాచారం ఇచ్చారు.

ఆ లయన్స్ క్లబ్ ప్రతినిధులు, చెముడులంక వచ్చి వీర్రాజు నేత్రాలను సేకరించి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీర్రాజు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 81 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎప్పుడు కళ్ళజోడు అవసరం లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్న ఆయన నేత్రాలు ఆయనతో పాటు మంటల్లో కలిసిపోకుండా ఉండేందుకు ఇలా దానం చేసి మరో ఇద్దరికి చూపుని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఆ కంటి ఆసుపత్రి ప్రతినిధి సుధారాణి మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత ఆరు గంటల లోపు తమకు సమా ఇవ్వాలన్నారు. మృతి చెందిన వారు కంటిపై తడిగుడ్డ ఉంచాలన్నారు. అలాగే ఫ్రీజర్ బాక్స్ లో మృత దేహాన్ని ఉంచితే 24 గంటల వరకు నేత్రాలు సేకరించడానికి అవకాశం ఉంటుందన్నారు. తమ ఆసుపత్రికి ఫోన్ నెం.9390434887 ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు.వీర్రాజు నేత్రాలు దానం చేసిన ఆ కుటుంబ సభ్యలను పలువురు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Elderly man donates eyes

You cannot copy content of this page

Scroll to Top