Aware of the Laws : సిద్దార్థ పాఠశాల విద్యార్థులకు చట్టాల ఫై అవగాహన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో వికారాబాద్ సి ఐ భీమ్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ డి ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై సిద్ధార్థ పాఠశాల విద్యార్థులకి చట్టాలు, పోలీస్ విధుల పై అవగాహనా కలిపించారు. ప్రతి విద్యార్థి పోలీస్ స్టేషన్లో పరిసరాల వివరిస్తూ పోలీసులు ఉపయోగించే ఆయుధాల గురించి కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు.ఈ సందర్బంగా డి ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన కలిగివుండాలని, ప్రజా భద్రతను కాపాడటం, చట్టాలను పాటించడం, మరియు పౌరుల హక్కులను గౌరవించడం వంటివి సమాజం లో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చట్టబద్ధమైన ఉత్తర్వులను పాటించడం, నేరాలను నివారించడం, ప్రజలకు సహాయం చేయడం పోలీసుల ముఖ్య విధులు పైన విద్యార్థి దశ నుండి తెలుసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ లు గిరన్న, ప్రవీణ్, మీనాక్షి లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Siddhartha School students to be aware of the laws

You cannot copy content of this page

Scroll to Top