Narayana Rao : తునిలో అత్యాచారం కేసు నిందితుడి మృతదేహం లభ్యం

TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి.. తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో అతడు దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rape case accused's body

You cannot copy content of this page

Scroll to Top