గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

TRINETHRAM NEWS

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి

విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం విజయవాడ రాజ్ భవన్ వేదికగా వీరి భేటీ జరిగింది. జనవరి 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మీనా గవర్నర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్న మవుతున్న తరుణంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతున్న అంశాలను, పలు కార్యకలాపాలను మీనా గౌరవ గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఓటర్ల తుది జాబితా విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top