విద్యార్థిని చితకబాదిన డి పి ఆర్ పాఠశాల యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులకు కనీస సదుపాయాలు లేకుండా నడుపుతున్న డి పి ఆర్ పాఠశాల యాజమాన్యం .
బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 16 త్రినేత్రం న్యూస్. డి పి ఆర్ పాఠశాల గుర్తింపు రద్దుచేయాలి అని బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని డి పి ఆర్ పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన సందర్భంగా డి పి ఆర్ పాఠశాల ఎదుట బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యార్థిని చితకబాదిన డి పి ఆర్ పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థిని చితకబాధం చాలా బాధాకారం అని ఆయన అన్నారు. తక్షణమే డి పి ఆర్ పాఠశాల గుర్తింపు రద్దుచేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పాత్లవత్ లక్ష్మణ్, పొట్ట మధు, జమీర్,జగన్,రాఖీ,వెంకటేష్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


