WhatsApp Image 2024 01 22 at 11.59.58 AM
ఎస్సై కాలికి బలమైన గాయం
రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఎస్సై జి. సురేష్ గాయపడ్డ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ద్విచక్ర వాహనంపై ఆయన వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని తప్పించే క్రమంలో ఆయన వాహనం అదుపు తప్పి ఎస్ఐ కింద పడ్డారు. దీంతో కాలికి బలమైన గాయాలు తగలగా వెంటనే చీరాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఎస్సై పరిస్థితి నిలకడగానే ఉందని,అవసరమైతే కాలికి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు.
స్టేషన్ సిబ్బంది పరామర్శించారు.
