తేదీ : 14/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం ,లో ఉన్నటువంటి పి. కేశప్ప గూడెం, రాజానగరం జమ్మిగూడెం, గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మరియు అధ్యక్షులు మల్లం నాగబాబు, జి. చిరంజీవి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుందని అన్నారు. పేదలకు మరియు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే పరిష్కార మార్గంగా తక్షణమే స్పందిస్తున్నారని తెలిపారు. ఒక డాబా ఎక్కాలంటే మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళితేనే ఆ డాబా పైకి వెళ్ళగలం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని సూచించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో ఆ గ్రామాల నుండి ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేయలేని పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వమే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన మళ్లీ మళ్లీ రావాలని, అంటున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా మద్ది కొండ , రాజానగరం మండల ప్రజా పరిషత్ ప్రధానోపాధ్యాయులు కూడా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ సమయం పాలన ప్రకారమే పాఠశాలలు తెరుస్తున్నామని, మధ్యాహ్నం భోజనం మెనో పట్టిక ప్రకారం పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుండి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఒక బాధ్యతగా మేము ప్రతి ఒక్క విద్యార్థి పట్ల శ్రద్ధ చూపించి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. ఆ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు చెప్పారు. అదేవిధంగా సాయంత్రం వేళ విద్యార్థులకు ఆటలు ఆడిస్తున్నామని, పేర్కొన్నారు. యూనిఫామ్ మరియు విద్యార్థులకు సంబంధించినటువంటి సామాగ్రిని అందించామని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


