వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ తినదగిన నూనె గింజల మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఏడీబిల్ ఆయిల్ ఆయిలసీడ్స్ నామియోస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే & డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దోమ, పూడూరు,పరిగి తదితర మండలాలకు చెందిన రైతులకు నూనె గింజల విత్తనాలను పంపిణీ చేశారు.పంటల ఉత్పత్తి పెంపుతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


