దేవరకొండ డివిజన్ అక్టోబర్ 13 త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా ఇన్చార్జిగా నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ ను ఎంపిక చేయడంజరిగింది .ఇందులోభాగంగా బోరబండ, సాయిబాబా నగర్, లో మూడు బూతులకు ఇంచార్జీ గా నియమించడం జరిగింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిమాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలనిఅన్నారు. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ నా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికకు పార్టీ తనను ఇన్చార్జిగా నియమించినందుకు బి ఆర్ఎస్ పార్టీ అధిష్టానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదరి కిషోర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


