Build a New District : నూతన జిల్లా కలెక్టరేట్ ను నిర్మించండి

TRINETHRAM NEWS

జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించండి

ఇళ్ల స్థలాలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

మున్సిపల్ స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడండి

జిల్లా కలెక్టర్ ను కోరిన సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం అక్టోబర్ 10 : తూర్పుగోదావరి జిల్లాలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని ముఖ్యంగా జిల్లా సమగ్ర అభివృద్ధి లేక జిల్లాలో ఉన్న యువత ఉపాధి అవకాశాలు లేక ఇతర నగరాలకు వలసలు పోతున్నారని నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని అదే విధంగా నూతన జిల్లా కలెక్టరేట్ ను నిర్మించాలని చాలా సంవత్సరాలగా అపరిస్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాటి తోట బైపాస్ రోడ్డు లో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కోరారు.

శుక్రవారం ఉదయం స్థానిక బొమ్మూరు కలెక్టర్, కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు జిల్లా కలెక్టర్, అన్ని సమస్యలు సావధానంగా విని సానుకూలంగా, స్పందించారు త్వరలోనే రాజమండ్రి కు మున్సిపల్ కమిషనర్ వస్తున్నారని ఆయన దృష్టి కూడా ఈ సమస్యలు తేవాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాజమండ్రిలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను అధికార పార్టీ అండదండలతో కబ్జాలు చేస్తున్నారని ఆయన తెలిపారు ముఖ్యంగా బైపాస్ రోడ్డు తాడితోట లో చేనేత వస్త్రాలయం పక్కన ఖరీదైన 150 గజాల స్థలాన్ని కంచి వేచి కబ్జా వేశారని అదేవిధంగా ఇన్నిస్పేటలో ఇంకో 100 గజాలను ఆనంద నగర్ లో మరో 200 గజాలను ఈ విధంగా కబ్జాలు చేసుకుంటూ పోతున్నారని దీనిని వెంటనే అరికట్టాలని ఆయన అన్నారు
రానున్న గోదావరి పుష్కరాలు నేపథ్యంలో రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని అక్కడే ట్రైన్లు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని సూపర్ ఫాస్ట్ లు అక్కడ ఆపాలని కోరారు శ్యామల నగర్ లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని క్వారీ కొంతమూరు ఆ ఏరియాలో మరో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించాలని రాజమండ్రిలో ట్రాఫిక్ ను సరిదిద్దాలని మధు కోరారు ఇళ్ల స్థలాలు సమస్యలు తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులకు ప్రత్యేకంగా ఆవలో ఉన్న భూమిని కేటాయించాలని లేనిపక్షంలో త్వరలో సిపిఐ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి మరో భూ పోరాటం చేసి మేమే ఆక్రమించుకుంటామని ఆయన తెలిపారు రానున్న గోదావరి పుష్కరాలు నేపథ్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని పెంచాలని లేకుంటే దీనిపై ఆందోళన చేస్తామని మధు కోరారు

ఇంకా జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ ఆఫీస్ బేరర్స్ కాకి సరదా పి పోలమ్మ బంగారు గిరి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Build a new district collectorate

You cannot copy content of this page

Scroll to Top