ఐ ఎఫ్ టి యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని, ఆ పథకాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ భవన ఇతర నిర్మాణ కార్మిక యూనియన్( ఐఎఫ్ టి యు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పరిపాలన అధికారి (ao) వినతి పత్రం అందజేశారు .
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు. రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్. లు పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పుతు కార్మిక వర్గ సంక్షేమ పథకాలను క్రమ క్రమంగా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నదని దీని తక్షణమే విరమించుకోవాలని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కీములను అందజేయాలని, సాధారణ మరణానికి, మ్యారేజ్ గిఫ్ట్, మెటర్నటీ, హాస్పిటలైజేషన్ కు, శాశ్వత అంగవైకల్యానికి నిధులు పెంచాలని అన్నారు రాష్ట్రంలో లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వీరికి అడ్డాల వద్ద, పని స్థలాల్లో భద్రత, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని తక్షణమే కార్మిక వర్గానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి 6000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ( ఐ ఎఫ్ టి యు ) జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, ఐ రాజేశం,ఎం కొమరయ్య, బి రాజనర్స్, కే మల్లేశం, తిర్రి బాలకృష్ణ, నారాయణ. తదితరులు పాల్గొన్నరు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


