Chamala Raghupathi Reddy : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలొ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్లు కీలక పాత్ర వహించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కీలక పాత్ర వహించాలని టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీ .చామల. రఘుపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన పాత్ర వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క సోషల్ మీడియా నాయకుడి పై ఉందని సోషల్ మీడియా ద్వారా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని త్వరలో తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం.

ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గ సోషల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్యలో సోషల్ మీడియా విభాగం వారధి లాగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ మీడియా ఇంచార్జ్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, సిద్దునూరు యాదగిరి, టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ కుమార్, కో కోర్డినేటర్ నరేందర్ రోహిత్ మరియు వివిధ వార్డుల సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Social media coordinators should play a key role

You cannot copy content of this page

Scroll to Top