కూకట్పల్లి అక్టోబర్ 10 (త్రినేత్రం న్యూస్) అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని కేరళలోని శబరిమల యాత్రకి కాలినడక బయలుదేరారు ఓ భక్తుడు. 21వ సారి అయ్యప్ప మాల వేసుకుని సందర్భంగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ ఇంద్ర గాంధీపురం కు చెందిన విజయ్, శ్రీనివాస్ గురు స్వామి ఆధ్వర్యంలో సనత్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహించి స్వామీ ఇరుముడి కట్టారు.
అనంతరం ఫతేనగర్ శివాలయంలో అన్నప్రసాదం స్వీకరించి ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు. సందర్భంగా విజయ స్వామి మాట్లాడుతూ సుమారు 1300 కిలోమీటర్ల పాదయాత్ర 38 రోజులు పాటు కొనసాగుతుందని తెలిపారు. రోజుకు 30 నుంచి 35 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ అయ్యప్ప స్వామి దేవాలయం ఏలిజాల యాదగిరి గురుస్వామి, శ్రీ ధర్మశాస్త్ర భజన మండలి ఆర్ కే రాజు గురు స్వామి, శ్రవణ్ స్వామి, కిరణ్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


