తేదీ : 09/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, పట్టణం ప్రభుత్వ వైద్యశాల నందు ఆరోగ్య విభాగానికి చెందిన వ్యాపారస్తులతో ఏర్పాటు చేసినటువంటి జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన ముందుగా మెడికల్ షాపులు, ఫార్మసి డిస్ట్రిబ్యూటర్ యాజమాన్లతో తగ్గినటువంటి జీఎస్టీ ప్రకారము మందులను అమ్ముతున్నారా లేదా?
అని, రక్త పరీక్షలు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని , గతంలో ఉన్నటువంటి ఆ పన్నులు అన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలా ప్రతి షాపు ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. లాభాలను వివరిస్తూ, పన్నులు తగ్గడం వలన వినియోగం పెరుగుతుంది, అదే విధంగా ఉత్పత్తి , ఉపాధి కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు చేకూరే లాభాలను వాళ్లకి అర్థమయ్యేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా అరవై వేలు సమావేశాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


