Trinethram News : Oct 08, 2025, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ ఎస్టీ తండా గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. జీవనోపాధి కోసం దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న రమేష్, తన గదిలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు బంధువులు, స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


