Collector Koya : రంగంపల్లి లోని వీ హబ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

TRINETHRAM NEWS

రామగుండం, అక్టోబర్ -07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అక్టోబర్ 12 నాటికి వీ-హబ్ నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రంగంపల్లి లోని వీ హబ్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో మహిళా వ్యాపార అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు వీ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు త్వరలో ప్రారంభించనున్నామని అన్నారు.
వీ-హబ్ పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అక్టోబర్ 12 నాటికి గ్రామీణ అభివృద్ధి శాఖకు అప్పగించాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఓ ఎం. కాళిందిని,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya Sriharsha inspects V-Hub

You cannot copy content of this page

Scroll to Top