CPI : సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై మతోన్మాది దాడికి నిరసనగా సిపిఐ దళిత సంఘాలు నిరసన

TRINETHRAM NEWS

సుప్రీంకోర్టు న్యాయవాది పై దాడి,భారత రాజ్యాంగం పై దాడి

సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు

త్రినేత్రం న్యూస్, కాకినాడ అక్టోబర్ 6 : సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్ పై మతోన్మాది అడ్వకేట్ దాడి చేయడానికి నిరసనగా సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గోడారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేశారని ఈ దాడి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని మధు అన్నారు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై ఇలాంటి దుశ్చర్య పాల్పడారంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు వెంటనే మత ఉన్మాది అడ్వకేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే ప్రధానమంత్రి స్పందించాలని భారత ప్రభుత్వం

ఈ దుచర్యను ఖండించాలని ప్రజాస్వామిక వాదులు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని మధు కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు ప్రముఖ న్యాయవాది తోకల ముఖేష్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని ఏఐటీయూసీ నాయకులు టి అన్నవరం ,న్యాయవాది వెంక్టేశ్వరావు తదితర నాయకులు ప్రసంగించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI Dalit groups protest

You cannot copy content of this page

Scroll to Top