Seetharamaiah : గని ప్రమాదాల్లో గాయపడ్డ కార్మికుల ను పరామర్శించిన సీతారామయ్య

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో వివిధ ప్రాంతాల్లో జరిగిన గని ప్రమాదాల్లో గాయపడి హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను శనివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పరామర్శించారు, సింగరేణి మందమర్రి ఏరియా కు చెందిన జె రవీందర్, ఆర్జీ టూ ఏరియా లోని ఓసిపి-3 మైన్ లో షావల్ ఆపరేటర్ ఎ. లక్ష్మీనారాయణ, భూపాలపల్లి ఏరియాలో కేటికే 6వ ఇంక్లైన్ లో గూడెల్లి మొండయ్య లు గని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వీరిని ఆయన పరామర్శించారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యూనియన్ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. కాగా సీతారామయ్య వెంట డాక్టర్ బాల కోటయ్య ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Seetharamaiah visited workers in the mine accidents.

You cannot copy content of this page

Scroll to Top