త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో బస్టాండ్ లో గల రిక్షా స్టాండ్ కార్మికులు మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ను శుక్రవారం ఆమె ఛాంబర్ లో కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో తమ రిక్షాస్టాండ్ బోర్డ్ ను మున్సిపల్ అధికారులు తొలగించారని తిరిగి యధా స్థానంలో పెట్టించాలని కోరారు.తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రిక్షా స్టాండ్ షెడ్ కొలతలు తీసుకుంటున్నారని వాపోయారు. అటువంటి చర్యలు ద్వారా తాము ఆందోళన చెందుతున్నామని ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ధూళి జయరాజు మాదిగ, కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్,వైస్సార్సీపీ నాయకులు ఎర్రగుంట అయ్యప్ప,రిక్షా యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ అయినవల్లి రమణ,చాపల సత్తియ్య,మడికి ఆనందరావు,అడ్డాల సత్తిబాబు,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


