వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నవాబ్ పేట్ మండలం అక్నాపూర్ గ్రామంలో పాఠశాలలో 1972-1984 మధ్యకాలంలో విద్యాబోధన చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ యం. పండరినాథ్ కి పూర్వ విద్యార్థులు వారి సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. పుష్కర కాలం పాటు గ్రామానికి సేవలందించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి జీవితాలలో వెలుగులను నింపిన మహానుభావుడని ప్రశంసించారు. మీరు పెట్టిన అక్షర భిక్షతోనే ఈరోజు మా ఊరిలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యాపారవేత్తలుగా సంఘ సేవలో సమాజ సేవలో గుర్తింపు పొంది వివిధ రంగాలలో ఎదిగేటందుకు బాటలు వేశారని పొగిడినారు.అభిమానంతో కొందరు శిష్యులు గజమాల వేయగా మిగిలిన శిష్యులు నూతన వస్త్రములతో బంగారు ఉంగరంతో శాలువా పూలదండలతో సన్మానించి గురువుగా పాదాలకు ప్రణమిల్లి వారి ఆశీస్సులు తీసుకొని తమ అనుభవాలను పంచుకున్నారు.
పండరీ నాథ్ పూర్వ విద్యార్థులు గోవిందోళ్ల నర్సింలు గౌడ్, బేగరి దేవదాస్, భానూరి నర్సిములు, గోవిందోళ్ల రమేశ్, జంగం పరమేశ, తలారి ఆశీర్వాదం, బేగరి బుచ్చయ్య ఈదులపల్లి శ్రీనివాస్ గౌడ్ , కౌకుంట్ల బందయ్యగౌడ్ పసుల లక్ష్మణ్ తలారి శివరాం బేగరి బందయ్య లతో పాటు గ్రామ పెద్దలు యువజన సంఘాలనాయకులు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ యువజన సంఘం, ఛత్రపతి శివాజీ యువజన సంఘం, కొమురం భీమ్ యువజనసంఘం, శివ సేన యువజన సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


