రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు అర్జీ-1 ఏరియా ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు “సద్దుల బతుకమ్మ సంబురాలు” అంగరంగా వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించన.. ఆర్జీ.1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్ , ఆర్జీ.1 సేవా సమితి అధ్యక్షురాలుడి.అనిత లలిత్ కుమార్ పాల్గొనడం జరిగినది.
ఈ సందర్బంగా రామగుండం శాసన సభ్యులురాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండగను తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా బతుకమ్మ పండగ వేడుకలను వైభవముగా నిర్వహించటం జరుగుతుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ వేడుకలను అన్నీ ఏరియాలలో ఇంత ఘనంగా నిర్వహించటం గొప్ప విషయం అని అన్నారు.
ఈ బతుకమ్మ వేడుకలలో అందంగా అలంకరించి సంప్రదాయ బద్దంగా పేర్చిన బతుకమ్మలను ముఖ్య అతిధుల చేతుల మిదుగా బాహుమతుల ప్రధానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాజీ మహంకాళి స్వామి, ఎసిపి మడత రమేష్ ,ఏం.డి ముస్తఫా కాంగ్రెస్ నాయకులు, ఏఐటియుసి నాయకులు రంగు శ్రీను, సిఎంఓఏఐ మల్లేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు రమేష్,చిలక శ్రీనివాస్, వేణు, శ్రావణ్, హనుమంత రావు,జితేధర్ సింగ్, వర ప్రసాద్ అధిక సంఖ్యలో మహిళలు, లేడిస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


