ఇ నరేష్, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోజున సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యాన, జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షతన, అంతర్గాం మండలం, పెద్దంపేట లోని పార్టీ కార్యాలయాలలో, ప్రతి సంవత్సరం లాగా సెప్టెంబర్ 24 నుండి 30 వరకు మహాత్మా జ్యోతి రావు పూలే స్థాపించిన “సత్యశోధక్ సమాజ్” 153వ దినోత్సవాన్ని పురస్కరించుకొని “కుల నిర్మూలన సదస్సు” నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా.. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఇ నరేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సహధర్మచారిణి సావిత్రిబాయి ఆనాడు సమాజంలో ఉన్న కుల,మత దురాచారాలను రూపుమాపటానికి అహర్నిశలు క్రృషి చేశారని, నిరుపేదవర్గాలను చేరదీసీ అక్షర్యాభ్యాసం చేసి చైతన్య పరిచారని, ఈనాడు దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కుల మతాల పేరిట చిచ్చు పెడుతూ కుల దురాహంకార దాడులకు, హత్యలకు కారకులవుతున్నారని, ఈ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బ్రాహ్మణయ హిందుత్వ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇంకా ఈ సధస్సుకు పార్టీ జిల్లా నాయకులు ఐ రాజేశం, కోడిపుంజుల జ్యోతక్క, కొల్లూరి మల్లేష్, పైడిపల్లి రమేష్, పెద్దంపేట తాజా మాజీ ఉపసర్పంచ్ కోడిపుంజుల భూమేష్, పార్టీ డివిజన్, మండల నాయకులు ఆరుమూల్ల తిరుపతి, సమ్మెట తిరుపతి, మాలెం తిరుపతి, ఇ బాబు, ఎన్ రమేష్, కె స్వప్న, కె చంద్రయ్య, పి అమ్రృతమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


