గ్రూప్ వన్ ఉద్యోగం పొందిన జగద్గిరిగుట్ట వాసిని అభినందించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్….
Trinethram News : ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో 43వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం సాధించిన జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్ పురి కాలనీకి చెందిన అక్కెనపల్లి రంజిత్ రెడ్డి ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలిచిన రంజిత్ రెడ్డి, ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలిచి భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలవాలి. ఈ సందర్భంగా గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన రంజిత్ రెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
రంజిత్ రెడ్డి జీవిత నేపథ్యం గమనిస్తే… చింతల్ లోని రెయిన్బో స్కూల్ లో పదవ తరగతి పూర్తిచేసి, మాసబ్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, సీబీఐటి కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేశారు. కాగా చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న రంజిత్ రెడ్డి తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండగా 2022 సంవత్సరంలో తండ్రిని కోల్పోయిన రంజిత్ రెడ్డి స్థానిక వైష్ణవీ టెక్నో స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ తల్లి ప్రేరణతో “టీచర్” గా పనిచేస్తూనే జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే గ్రూప్ వన్ కు సంసిద్ధం అవుతూ మొదటి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వైష్ణవీ టెక్నో స్కూల్ చైర్మన్ నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


