త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం, సెప్టెంబర్ 27 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హై సేవ కార్యక్రమం శనివారం కడియం మండలం దుళ్లలో జరిగింది.. దీనిలో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి స్వచ్ఛత పై ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులు తిరిగి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ఆపాలని, కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం పాటు పడాలని తెదేపా అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుర్రపు కొండయ్య మాష్టారు పిలుపు నిచ్చారు..కాచి చల్లార్చిన నీరు తాగాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఉమ్మడి పార్టీ నాయకులు ముమ్మిడి దేవి నాగేస్వర్రావు, కంటిపూడి శ్రీనివాస్, కులపాకల సత్తిబాబు, యర్ర సత్యనారాయణ, కార్యదర్శి కుమార్, పంచాయతీ సిబ్బంది, అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


