జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 8.57.10 PM

TRINETHRAM NEWS

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి …
అసిఫాబాద్ జిల్లా:జనవరి 21
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషాదకర సంఘటన ఆసిఫాబాద్‌ అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ వద్ద గాల ప్రధాన రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.

బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా లారీ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బాధితులు కాగజ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page