Annapurna : జిల్లా గర్వకారణం – అన్నపూర్ణ

TRINETHRAM NEWS

అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న ప్రతిభావంతురాలు..

త్రినేత్రo న్యూస్. మెగా డీఎస్సీ-2025లో ఉత్తమ ప్రతిభను చాటుతూ అచంచల కృషితో కడియం గ్రామానికి చెందిన శ్రీమతి వెలుగుబంటి అన్నపూర్ణ విశిష్ట స్థానాన్ని సాధించారు. ఇటీవల విడుదలైన మెగాడిఎస్సి 2025 ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) విభాగంలో 87 మార్కులు సాధించి, జిల్లాస్థాయిలో రెండవ ర్యాంక్ కైవసం చేసుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో ఈరోజు అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలువురు మంత్రులు,ప్రముఖులు పాల్గొన్నారు. తన భర్త కడియం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కడియం సొసైటి చైర్మన్ వెలుగుబంటి రఘురామ్ (నాని) తో కలిసి ఈ వేదిక పై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా మెగా డీఎస్సీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్న క్షణం అన్నపూర్ణ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది.
తన కృషితో మాత్రమే కాకుండా పట్టుదల, నిరంతర సాధనతో అనేక మందికి ఆదర్శంగా నిలిచిన అన్నపూర్ణను జిల్లా విద్యావర్గం, బంధుమిత్రులు, స్థానిక గ్రామస్తులు హర్షధ్వానాలతో అభినందిస్తున్నారు. అన్నపూర్ణ సాధించిన ఈ విజయం, ప్రతిభకు కృషి జోడిస్తే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చని నిరూపించింది అని ఎమ్మెల్యే గోరంట్ల తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Pride – Annapurna

You cannot copy content of this page

Scroll to Top