ఈనెల 27న ఆర్ ఆర్ ఆర్ భూ నిర్వాసితుల చలో కలెక్టరేట్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జయప్రదం చెయ్యండి* సిపిఎం వికారాబాద్ జిల్లా పరిధిలోని 4మండలలో 23గ్రామాలలో ఆర్ ఆర్ ఆర్ రోడ్, ఏరియల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న భూ బాధితులతో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నాం. భూ నిర్వాసీతుల అందరూ పాల్గొనాలి. నేడు వికారాబాద్ మండల పరిధిలోని పులుమామిడి పిరంపల్లి చించల్ పెట్ గ్రామాలలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ బృందం పర్యటించి భూ నిర్వాసితులతో మాట్లాడ్డం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ రోడ్ ఏరియల్ రింగ్ రోడ్ లో ప్రభుత్వం పేదల రైతుల భూములు బలవంతపు భూ సేకరణ చెయ్యవద్దు.

రైతులు కోరుకుంటేనే భూములు తీసుకోవాలి లేదా రైతులు వద్దంటే బలవంతపు భూ సేకరణ తీసుకోవద్దు అన్నారు. గతంలో ప్రభుత్వలు అనేక ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటే భూ సేకరణ చట్టాలు అమలు చెయ్యలేదు. ఈ ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం అమలు చెయ్యాలనీ కోరుతున్నాము. ఆర్ ఆర్ ఆర్ భూ బాధితుల పోరాటంలో సిపిఎం పార్టీ ఎల్లపుడు మద్దతు ఉంటుందన్నారు. ఈ పోరాటంలో రైతులు భూ బాధితులు పాల్గొనాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు కృష్ణారెడ్డి, కాలే సురేందర్, కాలే శ్రీను, నర్సింలు బాలరాజు రామచంద్రయ్య, జంగయ్య, సత్యనారాయణ, సుభాస్ నరసింహ రెడ్డి, మల్లయ్య సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collectorate to meet RRR landless people

You cannot copy content of this page

Scroll to Top