వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసిన ఏపీ జిఈఏ రాష్ట్ర కమిటీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గౌరవ్ సౌర్ ను తాడేపల్లి సచివాలయంలో ఆయన ఛాంబర్ లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ఆర్.సూర్యనారాయణ ఎం.రమేష్ కుమార్ ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సిహెచ్ విల్సన్ పాల్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇతర జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు విధి నిర్వహణలో భాగంగా కలిసి పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన జిఓ 143 రద్దు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలని, తొలగించిన పురుష హెల్త్ అసిస్టెంట్లను మరల విధులలోనికి తీసికోవాలని, ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని, మొదలగు ముఖ్య సమస్యలు పరిష్కరించాలని కోరగా కొద్దిరోజులలో మరలా విపులంగా చర్చించి సమస్యలు పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, కోనసీమ జిల్లా కార్యదర్శి కె.మల్లిబాబు, వైజాగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కర్నూలు నాయకురాలు మంజుల దేవి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP GEA State Committee meets

You cannot copy content of this page

Scroll to Top