MLA Jare Adinarayana : మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. 22.09.2025 – సోమవారం. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండల పర్యటనలో భాగంగా వెళ్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సీతాయిగూడెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం, అదుపుతప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడిన పరిస్థితిని గమనించిన వెంటనే స్పందించి తన సొంత వాహనంలోనే ,గాయపడిన మహిళను చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రి ,కి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం, పంపించే వరకు పూర్తి బాధ్యత స్వయంగా తీసుకున్నారు.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు కంటే విలువైనది మరేదీ లేదన్నారు. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వెంటనే అండగా నిలవడం మనందరి కర్తవ్యమని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana shows humanity

You cannot copy content of this page

Scroll to Top