District Collector : జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

పెద్దపల్లి, సెప్టెంబర్-20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ అటవీ సంపదను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ డి.వేణు, డీసీపీ కరుణాకర్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో అటవీ నరికివేత జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడానికి వీలు లేదని, అటవి నరికివేతకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కొత్త అటవీ ఆక్రమణలు అనుమతించవద్దని అన్నారు.. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి శివయ్య ఆటవి యొక్క స్థితిగతులపై ప్రొజెక్టర్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, ఏసీపి లు కృష్ణ, రమేష్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector participating

You cannot copy content of this page

Scroll to Top