CMRF : నాలుగు లక్షల(4,00,000) ముఖ్యమంత్రి సహాయ నిధి(ఎల్ ఓ సి) అందజేత

TRINETHRAM NEWS

కుకట్పల్లి ఆగస్టు 28 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రాజు కాలనీ కి చెందిన రాసమల్ల అనసూయ(69) వైఫ్ ఆఫ్ రాసమల్ల కొమ్మలు, అనారోగ్యం కారణంగా నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది.వారికి (స్టంట్ మరియు ఐ వి ఎల్ బెలూన్) సర్జరీ చేయాలని సూచించడం తో వారి కుమారుడు రాజేందర్ కూకట్పల్లి లోని గొట్టుముక్కల వెంకటేశ్వర రావు కార్యాలయంలో సంప్రదించగా గొట్టిముక్కల వెంకటేశ్వరరావు బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహానిది కి దరఖాస్తు చేయించడం జరిగింది. ప్రభుత్వ పెద్దల సహకారంతో వారికి ఎల్ ఓ సి ద్వారా 4లక్షల రూపాయలు మంజూర్ చేయించడం జరిగింది.ఆ లెటర్ ని కూకట్పల్లి హేమ దుర్గ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ చేతుల మీదుగా వారి కుమారుడికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వర రావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ లక్ష్మయ్య, కొప్పిశెట్టి దినేష్, సాధు ప్రతాప్ రెడ్డి, గంధం రాజు, ఆకారం అనిల్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి కుమారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి, గొట్టుముక్కల వెంకటేశ్వర రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's Relief Fund (LoC)

You cannot copy content of this page

Scroll to Top