అధికారులపైన చర్యలు తీసుకోవాలి ….! సర్పంచ్ స్టాలిన్..
త్రినేత్రం న్యూస్, కడియం.. కడియం మండలం.. జేగురుపాడు గ్రామంలో ప్రభుత్వం క్రొత్తగా పంపిణీ చేస్తున్న రేషన్ కార్డులను గ్రామ సచివాలయం వద్దకాకుండా ప్రయివేటు స్థలం లో ఇస్తుండగా మరియు పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ స్టాలిన్ ని ఆహ్వానించక పోవడమే కాకుండా బీసీ ఎస్ సి కులస్థులను ఎవ్వరిని ఈకార్యక్రమానికి పిలవక పోవడంతో ప్రజలు నిరసన తెలిపి సర్పంచ్ స్టాలిన్ కి విషయం తెలియచేయగా ఆయన పంపిణీ చేస్తున్న ప్రాంతానికి వచ్చి విషయం తెలుసుకొని ప్రోగ్రాం ఏర్పార్టు చేసిన వి అర్ ఓ శివ కృష్ణ అక్కడ లేకపోవడంతో ఫోన్ చేసి ప్రోటోకాల్ పాటించకుండా సచివాలయం వద్ద కాకుండా ప్రయివేట్ స్థలంలో ఎందుకు ఏర్పార్టు చేసారని నిలదీసి ఈవిదంగా కొన్ని వర్గాల ప్రజలను గ్రామంలో వివక్షత చూపిస్తూ వాళ్ళను పిలవకుండా అవమాణించిన సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని రాజమండ్రి డివిజనల్ అధికారి వారి ఆఫీస్ ఏ ఓ ఇంచార్జి వారికి జేగురుపాడు గ్రామ సర్పంచ్ స్టాలిన్ గ్రామంలోని దలిత నాయకులు బీసీ నాయకులు కలసి పిర్యాదు చేసినారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి వి. అర్. ఓ శివ కృష్ణ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలలో అన్ని కులాలవారికి సామాజిక న్యాయం పాటించాలని కులాలమధ్య ఘర్షణలకు దారి దీ సేలాగున రెచ్చకొట్టే విదంగా చేసిన స్థానిక వి అర్ ఓ శివకృష్ణ మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ స్టాలిన్ డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


