స్మార్ట్ రేషన్ కార్డులతో అక్రమాలకు చెక్.
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృధి, సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .
త్రినేత్రం న్యూస్, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను తావులేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా రైస్‌కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఉండే స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో సచివాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, దీపం పథకం,తల్లికి వందనం,మరియు స్త్రీ శక్తి , రైతులకోసం అన్నదాత సుఖీభవ లాంటి ఎన్నో పథకాలను అమలుచేస్తున్నామని ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందిస్తున్నామని తెలిపారు..ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అభివృధి, సంక్షేమం ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం సహకారముతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వం అత్యంత పగడ్బందీగా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించిందన్నారు. ఇప్పటి వరకు ఉన్న రైస్ కార్డుల్లో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫొటో ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫొటో ఉంటుందని తెలియజేసారు. ఇతర సభ్యుల పేర్లు మాత్రమే నమోదు చేస్తారన్నారు.
ప్రస్తుతం ఇవ్వనున్న స్మార్ట్ కార్డులు బ్యాంకు డెబిట్ కార్డు (ఏటీఎం)ల తరహాలో ఉంటాయన్నారు. పారదర్శకతతో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్‌తో వీటిని అనుసంధానం చేయడం వలన రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టవచ్చన్నారు. స్మార్ట్ ఈ-పోస్ మిషన్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేనుందని, ఇప్పుడిస్తున్న స్మార్ట్ కార్డులను ఈ యంత్రం ద్వారా స్వైప్ చేస్తే కార్డుదారుడి వివరాలు వస్తాయన్నారు. దీని వల్ల గతంలో యంత్రాలతో వచ్చిన సర్వర్ సమస్యలు ఉండవని తెలియజేసారు. రాజానగరం నియోజకవర్గంలో 85101 కొత్త స్మార్ట్ కార్డులను అందచేయడం జరుగుతుందన్నారు. తాజా పరిణామాలతో రేషన్ పంపిణీ వ్యవస్థ నూతన సాంకేతిక మార్పులతో అత్యంత పకడ్బందీగా మారనుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


