బురాన్ పల్లి గ్రామంలో రూ. 1.46 కోట్ల అభివృద్ధి పనులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 20 లక్షలతో నిర్మించే బురాన్ పల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన. రూ. 63 లక్షలతో పి డబ్ల్యూ రోడ్డు నుండి బురాన్ పల్లి వరకు నూతన బీటి రోడ్డుకు ప్రారంభోత్సవం. రూ. 63 లక్షలతో బురాన్ పల్లి నుండి ధన్నారం వరకు నూతన బి టి రోడ్డుకు ప్రారంభోత్సవం. పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్థులు, ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఇది మీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, గత పదేళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.ముఖ్యంగా రోడ్లు అధ్వాన్నంగా అయ్యాయి. నేను 2014 కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన రోడ్లు మాత్రమే ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక 600 కోట్ల రూపాయలతో పంచాయతీ రాజ్, ఆర్ & బి రోడ్లకు మరమ్మతులు చేయించడం, కొత్తగా వేయించడం జరుగుతుంది.
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. ఇప్పుడు మన ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్ల మిత్తి చెల్లిస్తుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం, స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు మాత్రమే బాగు పడ్డారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగా లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధవంతంగా పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులను మంజూరు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలలో మెజారిటీ అమలు చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలెండర్ అందుతున్నాయి.
హామీ ఇవ్వకున్నా పేదల కోసం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగైన తరువాత మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం, తులం బంగారం హామీలను కూడా అమలు చేస్తాం. పెన్షన్లను పెంచడానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు అడ్డంకిగా మారాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి.మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. అన్ని పథకాలను మహిళల పేరు మీద అమలు చేస్తున్నది. మహిళా సంఘాలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు.
గత ప్రభుత్వంలో పేదలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసారు.త్వరలోనే అసైన్డ్ కమిటీల ఏర్పాటవుతాయి. భూముల సర్వేలు చేయించి మిగులు భూములను భూమి లేని పేదలకు పంపిణీ చేస్తాం.గ్రామస్తులు కోరిన విదంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు, మౌళిక వసతులకు నిధులను మంజూరు చేయిస్తున్నాను. స్వంత ఇళ్ళు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం.
దరఖాస్తు చేసుకున్న, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయి. బురాన్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి వారం రోజుల్లోగా కొత్త బోరు వేసి మోటార్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నా. పొలాలకు వెళ్ళే దారులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి బాగు చేయిస్తాను. బురాన్ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తాను.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Buranpalli village development works

You cannot copy content of this page

Scroll to Top