అల్లూరిజిల్లా అరకులోయ ఆగస్టు 22 ,(త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సర్కిల్ డుంబ్రిగూడ, అరకులోయ, అనంతగిరి పరిధిలోగల వినాయక మండపాల కోసం ఎలాంటి రుసుము లేకుండానే ఆన్ లైన్ అనుమతులు పొందవచ్చని అరకు సీఐ ఎల్. హిమగిరి తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు మండపాల కోసం https://ganeshutsav.net లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులో అడ్రస్, కమిటీ వివరాలు, నిమజ్జనం తేదీ, వాహనం వివరాలు ఇవ్వాలి.
అనంతరం సంబంధిత అధికారి పరిశీలించి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన (ఎన్ ఓ సి) జారీ చేస్తారు.(ఎన్ ఓ సి )డౌన్లోడ్ చేసుకొని మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు, రోడ్లపై మండపాలు వేయకూడదని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించకూడదని సీఎం హిమగిరి సూచించారు. అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం సమయంలో కమిటీ సభ్యులు శాంతి భద్రతలపై శ్రద్ధ వహించాలని సీఐ ఎల్. హిమగిరి సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


