అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 20: అరకువేలి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కార్మికులు అప్పులు చేసి వడ్డీలు కట్టి వంట చేస్తున్నారని, వర్షాల్లో షెడ్లు లేక సొంత డబ్బులతో షెడ్లు వేసి వంట చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వంట షెడ్లు నిర్మించి, ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా కార్మికులను కదిలించి డీఈఓ కార్యాలయం ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


