FLN, TLM Mela : మండల స్థాయి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ,ఎఫ్ ఎల్ ఎన్ , టీఎల్ ఎం మేళా

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెరుకుపల్లి పాఠశాల ప్రాంగణంలోనిర్వహించారు. ఇట్టి మేళాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే సమయములో ఉపయోగించే బోధనోపకరణములు సులభతరమైనటువంటి, ఆకర్షనీయమైనా మరియు సృజనాత్మకమైనటువంటి టీ ఎల్ ఎం ,లను తయారుచేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా విద్యను బోదించాలో ఇట్టి కార్యక్రమంలో ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టి ఎల్ ఎం మేళ ప్రదర్శనలో ప్రతి పాఠశాల నుండి కనీసం రెండు టి ఎల్ ఎం లు మరియు గరిష్టంగా 4 టి ఎల్ ఎం ల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలోమండల విద్యాధికారి గోప్యనాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు లు తదితరులు పాల్గొనిఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

primary schools, FLN, TLM Mela

You cannot copy content of this page

Scroll to Top